అమ్మకు బిడ్డకు, ‘పేగుబంధం’.
సొంత ఊరికి మనకూ…….. జ్ఞాపకాల గంధం.
అది ఇగిరిపోని గంధం.
కంట తడి తగిలితే చాలు,
మనసును పన్నీటి సంద్రంలో జలకాలాడించే గంధం.
అమ్మ ఎవరికయినా అమ్మే. సొంతూరు మీకయినా నాకయినా ఒకటే. ఎప్పటికప్పుడు ఏవో
అవాంతరాలు ఎదురయినా….చాలా కాలం తర్వాత కాలం కలిసివచ్చి ఊరి బాట పట్టాం నేనూ, మా తమ్ముళ్లు.(నా)
ఈ గాలీ, ఈ నేలా, ఈ ఊరూ, సెలయేరూ.. మముగన్న మా వాళ్లూ, మా కళ్లలో లోగిళ్లూ … ఉఫ్ ! ఎంత అందమైన భావన. కళ్ళాలు విప్పుకున్న గుర్రాలమీద, రెక్కలు తెరుచుకున్న ఊహల పైన వడివడిగా వెడుతున్నాం… ఎందుకంత తొందరంటారా 1!!!
అది దసరా. మా ఊరి దసరా. అచ్చంగా మా దసరా.
చిర్రగోనె, బొంగరాలు, ఉర్రు, కాలికింది కట్టె, నక్కమూటి, గోటీలు, బావుల్లో ఈతలు ఎన్నెన్నో ఆటలు…!! కాలాన్ని గిరుక్కున వెనక్కి తిప్పితే ఎన్నెన్నో జ్ఞాపకాలు… ఏటి గట్లని, అడవి చెట్లనీ, పంట చేలనీ, పసుల మందనీ, వెండి వెన్నెల్నీ, వీధి నాటకాల్సి, శార్తకాల్ల కథల్ని, దొమ్మరి ఆటల్ని, భజన పాటల్ని అస్ప్సేదూల .. అలయబలయ్ పీర్ల పండగల్ని మంచెలెక్కడం, చిలకల్ని కొట్టడం, గిరక కొట్టడం, బెల్లం వండటం, పార, పలుగు, తట్ట, బుట్ట, సుత్తీ కొడవలి, నాగలి, బండి ,గ్యారె, కమ్మి, ఈత పండ్లు, జీడి పండ్లు, చిటిమిటి పండ్లు, తునికి పండ్లు, మొర్రి పండ్లు, మారేడు పండ్లు, ఇరికి పండ్లు ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో అనుభవాలు, ఎన్నో ఆనందాలు, ఎన్నో అనుభూతులు… బచ్‌పన్‌కే దోస్తులు, బదలాయించని ఆస్తులు…
స్మూలుంటే.. చేతిలో పుస్తకాల సంచి, పెన్ను, పెన్సిళ్ళ డబ్బాతో పొరుగూరికి పొలాల గట్ల పైన
నడుస్తూ.. స్కూలు లేకుంటే చేతిలో పగ్గం, ముల్లుకట్టె, ముందర ఎడ్లూ, నాగళ్ళు. పల్లెపాటలు పాడుతూ .. అదో లోకం…
అమ్మ ఎవరికయినా అమ్మే. సొంతూరు మీకయినా నాకయినా ఒకటే. ఎప్పటికప్పుడు ఏవో
అవాంతరాలు ఎదురయినా….చాలా కాలం తర్వాత కాలం కలిసివచ్చి ఊరి బాట పట్టాం నేనూ, మా తమ్ముళ్లు.
ఊహ తెలిసేసరికి ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబం కూరుకుపోవడంతో, కష్టాలను ఈదుకుంటూ, అవమానాల్ని భరించుకుంటూ సాగుతున్న జీవితంలో ఎన్నో మజిలీల్ని దాటుతూ ఇప్పుడు ఒక గౌరవప్రదమైన మెట్టుపై నిలిచాక….. అంతరాంతరంలో మథనం… ఎందాకీ పయనం ! ఏమిటీ జీవితం !
మనిషిగా ఎందుకు పుట్టాం, ఏం సాధించడానికి ! ! ! తర్వాత తరాలకు మన జ్ఞాపకాలను పదిలంగా ఈ లోకంపై వదిలి వెళ్ళడం ఎలాగా ! మన బతుకు పండాలంటే, పరిమళాలు వెదజల్లాలంటే ఏం చేయాలి..? మనోఫలకం మీద అనేకానేక ప్రశ్నలు, అంతులేని తపన. కాలచక్రాన్ని రివర్స్‌గేర్‌లో పెడితే ఎన్నెన్నో మధురాతి మధురమైన స్పృతులు ఒక్కొక్కటిగా కళ్ళముందు కదలాడుతున్నాయి. డబ్బూ, ఇళ్ళూ, కార్లు, ఆస్తులు సంపాదించడానికేనా మనం పుట్టింది..? కానప్పుడు….. మరెందుకు?
జ్ఞాపకాల ప్రవాహాన్ని ఈదుకుంటూ మా ఊరికి చేరుకున్నాం. తీరా చేరుకున్నాక ఊర్లో దసరాని చూస్తే ఉన్న ఉత్సాహం ఆవిరైంది. ‘జంబీకి వంద మందికి మించి రాలేదు. ఏ కులమైనా మతమైనా ఊర్లో అందరం కలిసి సాయంత్రం శమీ పూజ నిర్వహించాక ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ, కర్రసాము చేస్తూ, తల్వార్లు తిప్పుతూ ఊరేగింపుగా రావడం….. కళ్ల లోపలి పొరల్లోని స్త్రాంగ్ రూంలో భద్రంగా ఉంటే ఇప్పుడు… ఇదేమిటి.. ఇలా… కళ తప్పింది…కళ సరే..దారి కూడా తప్పామా ???
చిన్ననాటి స్నేహితుల్ని ఇలా ఎందుకని అడిగినప్పుడు – ఎవరికివారు ఇళ్ళలోనే ఉండి దావతులు చేసుకుంటున్నారని, బయటికి రావడం లేదని వారి నుంచి విన్నాక మనసులో చాలా బాధ కలిగింది. ఎందుకిలా మన సంప్రదాయాల్ని మరచి మనుషులందరం ఒంటరివాళ్ళం అయిపోతున్నామో అర్ధం కాలేదు. పట్నాల వాసనలు పల్లెల్ని కూడా కలుషితం చేసాయా..? పండగల పేరుతో అందరం కలిసి ఆనందాల్ని పంచుకునే పద్ధతులు మారిపోయాయా, మాసిపోయాయా? టెలివిజన్‌లు ఇళ్ళల్లో దూరి మనుషుల్ని నాలుగు గోడలకే పరిమితం చేసాయా..?
ఓ రోజు తిరుమల మెట్లు ఎక్కుతూ ఉంటే మనస్సంతా అలజడి……
ఏమిటీ సవ్వడి…ఎందుకీ అలజడి… ఇప్పుడన్నీ ఉన్నాయి కదా….పేరు, ప్రతిష్ట గుర్తింపు, గౌరవం….అయినా ఏదో వెలితి….ఏమిటది..? ఇది చాలదు బతకడానికి… మరి.. ఇంకేదో తపన.. కొండ మెట్లు ఎక్కుతూనే ఉన్నా,చెమట కక్కుతూ… మెల్లగా మెట్టుపై… మెట్టు.. అలా… అలా.. మెలమెల్లగా… ఎడారిలో చినుకులా… చిమ్మ చీకట్లో చిరు వెలుగులా…మా పల్లె… నేను పుట్టి పెరిగిన పల్లె…..నన్ను లాలించిన పల్లె, నన్ను మురిపించిన పల్లె….మా ఊరు.. మా నర్సింగపల్లె..
నిజామాబాద్‌కు కూతవేటు దూరంలో కల్మషం, కాలుష్యం అంటే తెలియని ఆ పల్లె… మసక మసక గీతలా మొదలయి కృష్ణ గీతలా, ఓ ముత్తయిదువులా.. మళ్ళీ కళ్ళముందు బేలగా… మా అమాయకపు పల్లె…. ఔను !!! ఆ పల్లెకు ఏదో ఒకటి చేయాలి… అదే నా జీవితంలో ఉత్కృష్టమైన కార్యం కావాలి….
వెంటనే తమ్ముళ్ళు – దిల్ రాజు, శిరీష్, సింహంల ముందు… నా బాధను వెల్లగక్కాను.
మళ్ళీ దసరా తర్వాత ఓ రోజు ఊరికి బయల్దేరా……ఊరివారందర్నీ పోగు చేసి….ఇలా ఎందుకు జరుగుతోంది, మన తరువాత తరం వారికి మన సంప్రదాయాలు, కుటుంబ విలువలు ఎలా అందజేయాలి అనే ప్రశ్నలతో సమాలోచనలు చేసా. ఇకపై అందరం కనీసం ఒక్క దసరా పండగకైనా కలుసుకోవాలని నిర్ణయించాం. ఇకపై మే౦ ప్రతి దసరాకి ఎక్కడున్నా కచ్చితంగా ఊరికి వస్తామని అలాగే మీరందరూ కూడా పాల్గొనాలని గ్రామస్తులందరిని ఒప్పించి తీర్మానించాం. అలా మళ్ళీ మా ఊర్లో పండగలకి అందరితో కలిసి పాల్గొనే సత్స౦ప్రదాయానికి తెరదీసాం.
సొంత ఊరికీ మనకూ…………. జ్ఞాపకాల గంధం. అది ఇగిరిపోని గంధం. కంటి తడి తగిలితే చాలు, మనసును పన్నీటి సంద్రంలో జలకాలాడించే గంధం.
అదే ఈ గ్రంథం. ఇది ఊహల గంధం కాదు…… పెల్లుబికిన ఉత్సాహాల బంధం కాదు, వాస్తవాల గ్రంథం. కాలికి బలపంగట్టుకుని తన చరిత్రను తానే వల్లెవేసుకుంటున్న గ్రంథం.
తెరముందే మేం….మరి తెర వెనుక ! ! ! ఎవరు చేయిస్తున్నారివి………..?
మూల కారణంబెవ్వడు…….సర్వము తానెయైన వాడెవడు
అనాది మధ్యలయుడైనవాడు నడిపిస్తే……తడబాటు లేదు..ఎడబాటూ లేదు……!!!
Maapalle Meetup 2022, Narsingpally
Related Articles
No Results Found
The page you requested could not be found. Try refining your search, or use the navigation above to locate the post.
Recent Comments